Share News

కేంద్ర పంచాయతీరాజ్‌ కమిటీలోకి కృష్ణతేజ

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:59 AM

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజకు జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన కమిటీలో ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు.

కేంద్ర పంచాయతీరాజ్‌ కమిటీలోకి కృష్ణతేజ

  • ఏపీ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజకు జాతీయస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన కమిటీలో ఆయన సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి వికసిత్‌ గ్రామ్‌ స్వరాజ్‌ యోజన(పీఎం-వీజీఎస్‌వై) అమలుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది.

రాష్ట్రాల తరఫున నామినేట్‌ చేసిన ఐదుగురు ప్రతినిధుల్లో కృష్ణతేజ ఒకరు కావడం విశేషం. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలు చేయనున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.7,395.55 కోట్ల ఆర్థిక కేటాయింపునకు ఆమోదం తెలిపింది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనతో పాటు అవసరమైన సిఫారసులను కమిటీ సిద్ధం చేస్తుంది. కమిటీలో కృష్ణతేజకు చోటు దక్కడంతో పథకం రూపకల్పనలో ఏపీకి ప్రాతినిధ్యం లభించినట్లయింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:00 AM