మెగా డీఎస్సీపై అన్ని పిల్స్ కలిపి విచారిస్తాం
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:06 AM
మెగా డీఎస్పీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.
హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్పీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం(పిల్)పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే ఓ పిల్ దాఖలైందని, ప్రస్తుత పిల్‌ను కూడా దాంతో కలిపి విచారిస్తామని ప్రకటించింది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. మెగా డీఎస్సీ-2025లో ఎలాంటి రాతపరీక్ష నిర్వహించకుండా క్రీడల కోటా కింద ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారని, ఈ నియామకాలను రద్దు చేయాలని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మంగళగిరి మండలం, నిడమర్రుకు చెందిన రిటైర్డ్ ఎంఈవో జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్