Share News

వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయి సీఈవోను నియమించాలి

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:37 AM

వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయి చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ (సీఈవో)ను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది.

వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయి సీఈవోను నియమించాలి

  • హైకోర్టులో పిల్‌.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయి చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ (సీఈవో)ను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.

ఏపీ వక్ఫ్‌బోర్డుకు పూర్తిస్థాయి ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ను నియమించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఇండియన్‌ యునియన్‌ ముస్లింలీగ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాజావలి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది బషీర్‌ అహ్మద్‌ వాదనలు వినిపిస్తూ జాయింట్‌ సెక్రటరీ స్థాయికి తగ్గని అధికారిని పూర్తిస్థాయి సీఈవోగా నియమించాల్సి ఉంటుందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:37 AM