Share News

జస్టిస్‌ ఎంఎస్.లిబర్హాన్‌కు హైకోర్టు ఘన నివాళి

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:38 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ సింగ్‌ లిబర్హాన్‌కు హైకోర్టు ఘన నివాళి అర్పించింది.

జస్టిస్‌ ఎంఎస్.లిబర్హాన్‌కు హైకోర్టు ఘన నివాళి

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ సింగ్‌ లిబర్హాన్‌కు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల మరణించిన చండీగఢ్‌కు చెందిన జస్టిస్‌ ఎంఎస్.లిబర్హాన్‌కు నివాళి అర్పించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌ నేతృత్వంలో న్యాయమూర్తులు మొదటి కోర్టు హాలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్‌ లిసా గిల్‌, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌... జస్టిస్‌ ఎంఎస్.లిబర్హాన్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఎంఎస్.లిబర్హాన్‌ కుటుంబ సభ్యులు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ యలమంజుల బాలాజీ, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ నిరంజన్‌, హైకోర్టు రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 05:39 AM