కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనధికార వ్యక్తులను అనుమతించొద్దు
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:15 AM
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు...
ఎస్‌ఈసీకి హైకోర్టు ఆదేశం
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతించాలని, అనధికార వ్యక్తులను అనుమతించవద్దని ఎస్‌ఈసీని హైకోర్టు ఆదేశించింది. అందరి గుర్తింపు కార్డులను క్షుణ్నంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులను అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మంగళగిరి ము న్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కె.పున్నా నాయక్ హై కోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాజ్యంపై శుక్రవారం హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ రెడ్డి వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ కేంద్రాల వద్దకు రావద్దని తమ ఏజెంట్లను బెదిరిస్తున్నారన్నారు. అనధికార వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతించకుండా పోలీసులు, ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..