Share News

ఎస్‌ఈసీ సర్క్యులర్లకు అనుగుణంగా నడుచుకోండి

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:19 AM

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఓటింగ్‌, లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించి, భద్రపరిచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌...

ఎస్‌ఈసీ సర్క్యులర్లకు అనుగుణంగా నడుచుకోండి

  • ఎన్నికల అధికారులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఓటింగ్‌, లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించి, భద్రపరిచేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ)ని ఆదేశించాలని కోరుతూ వైసీపీ మేయర్‌ అభ్యర్ధి కె.పున్నానాయక్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వినీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ, ఫుటేజ్‌ భద్రపరిచే విషయంలో ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ జారీ చేసిన సర్క్యులర్లకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులను ఆదేశించి, పిటిషన్ను డిస్పోజ్‌ చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 05:20 AM