Share News

ట్రావెల్స్‌ చార్జీలపై 2 నెలల్లో ఉత్తర్వులు ఇవ్వండి

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:30 AM

పండుగలు, వారాంతాల్లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు(ట్రావెల్స్‌) అధిక చార్జీలు వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ట్రావెల్స్‌ చార్జీలపై 2 నెలల్లో ఉత్తర్వులు ఇవ్వండి

  • రవాణా కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): పండుగలు, వారాంతాల్లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు(ట్రావెల్స్‌) అధిక చార్జీలు వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఏడాది జూలై 20న పిటిషనర్‌ సమర్పించిన వినతిని పరిగణనలోకి తీసుకుని రెండు నెలల్లో రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ట్రావెల్స్‌ దోపిడీని అరికట్టేందుకు ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంటూ పిల్‌ను డిస్పోజ్‌ చేసిం ది.

ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. పండుగలు, వారాంతాలు, రద్దీ సమయాల్లో ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన అధిక చార్జీలు వసూలు చేయకుండా ప్రైవేటు బస్సు నిర్వాహకులను అడ్డుకునేలా రవాణా శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన చిట్టినేని సాంబశివరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశా రు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 04:35 AM