Share News

12 చెక్‌ బౌన్స్‌ కేసులు పరిష్కారం

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:34 AM

చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కార నిమిత్తం శనివారం హైకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.

12 చెక్‌ బౌన్స్‌ కేసులు పరిష్కారం

  • హైకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహణ

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కార నిమిత్తం శనివారం హైకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. 12 కేసులను పరిష్కరించి రూ.22.95 లక్షల పరిహారం అందజేసేందుకు అవార్డు జారీ చేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లిసాగిల్‌, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మార్గదర్శకంలో ఈ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు.

ప్రత్యేక లోక్‌ అదాలత్‌ బెంచ్‌లకు డాక్టర్‌ జస్టిస్‌ లక్ష్మణరావు, జస్టిస్‌ మెడమల్లి బాలాజీ నేతృత్వం వహించారు. న్యాయవాదులు వి.రఘు, సాతులూరి మురళీ మోహన్‌ సభ్యులుగా వ్యవహరించారు. సహకరించిన అందరికీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 07:35 AM