Share News

రాజ్యాంగ విలువల పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర కీలకం

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:32 AM

భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

రాజ్యాంగ విలువల పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర కీలకం

  • హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌

ఏఎన్‌యూ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దొనాడి రమేష్‌ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ రమేష్‌ మాట్లాడుతూ... రాజ్యాంగ విలువల పరిరక్షణలో న్యాయవ్యవస్థ, న్యాయవాదులు, న్యాయ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు, పౌరుల బాధ్యతలను గుర్తించడం కూడా ప్రతి ఒక్కరి కర్తవ్యమని సూచించారు. వీసీ గంగాధరరావు మాట్లాడుతూ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను గౌరవిస్తూ, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. శివరామ్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ సింహాచలం, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ త్రిమూర్తిరావు, న్యాయవిభాగపు హెచ్‌ఓడి విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 01:35 AM