పాఠశాల విద్య కమిషన్ చైర్మన్‌ను నియమించండి
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:20 AM
పాఠశాల విద్య కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీ కార్యదర్శి షేక్ హసీనా బేగమ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
హైకోర్టులో పిల్.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీ కార్యదర్శి షేక్ హసీనా బేగమ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. చైర్మన్ నియామకానికి సంబంధించి అక్టోబరు 1న పిటిషనర్ సమర్పించిన వినతిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు ప్రతి అందిన నాలుగు వారాల్లో వినతిపత్రంపై నిర్ణయం వెల్లడించాలని స్పష్టం చేస్తూ, పిల్‌ను పరిష్కరించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత పిటిషనర్ తరఫున న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఏప్రిల్ 2024 నుంచి చైర్మన్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. వెంటనే భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విద్యా శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.... విద్య కమిషన్ ఏర్పాటు విషయంలో ఇచ్చిన జీవోలను గతంలో హైకోర్టు కొట్టివేసిందన్నారు. కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్