విశాఖ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:41 PM
విశాఖ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: విశాఖ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో ప్రజలను స్టేషన్‌కు పిలిపించడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విశాఖలో అసలు ఏం జరుగుతోందంటూ మండిపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని విశాఖ పోలీస్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ పేరుతో పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ వల్లెపు నాగరాజు హైకోర్టును ఆశ్రయించారు. భూ బదలాయింపు విషయంలో సొమ్ము చెల్లించాలని పోలీసులు బెదిరిస్తున్నారని నాగరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం చట్టబద్దతను తేల్చేందుకు సీజే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతోందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి
స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా