Share News

ఏసీబీ కోర్టులో తగిన దరఖాస్తు వేసుకోండి

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:06 AM

మద్యం, ఇసుక విధానాలతో పాటు ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల మూసివేత ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలు, ఇతర దస్త్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ...

ఏసీబీ కోర్టులో తగిన దరఖాస్తు వేసుకోండి

  • సర్టిఫైడ్‌ కాపీలు కోరిన పిటిషనర్లకు హైకోర్టు సూచన

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మద్యం, ఇసుక విధానాలతో పాటు ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల మూసివేత ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలు, ఇతర దస్త్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరఫున న్యాయవాది ఉన్నం అఖిల్‌ చౌదరి వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్‌ కేసులకు సంబంధించి థర్డ్‌ పార్టీ సర్టిఫైడ్‌ కాపీ లు పొందేందుకు వీలుగా హైకోర్టు రూల్‌-212ను సవరించిందన్నారు.

పిటిషనర్లు ఏసీబీ కోర్టును ఆశ్రయించి తగిన అప్లికేషన్‌ వేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ రూల్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌లో రూల్‌-212ను సవరించి 212(ఏ)ను హైకోర్టు చేర్చిందని గుర్తు చేసింది. ఏసీబీ కోర్టులో తగిన దరఖాస్తు వేసుకొనేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇస్తూ వ్యాజ్యాలను డిస్పోజ్‌ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 01:10 AM