అనారోగ్యానికి సకాలంలో మందు
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:14 AM
వివిధ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు వీటి కొనుగోలు విధానంలో మార్పునకు ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ కొనుగోళ్ల విధానంలో మార్పునకు శ్రీకారం
వైసీపీ హయాంలో 3 నెలల డిమాండ్‌కు అనుగుణంగా...
6 నెలల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లకు మంత్రి నిర్ణయం
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): వివిధ స్థాయిల్లోని అన్ని ప్రభుత్వాసుపత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరాలో జాప్యాన్ని నివారించేందుకు వీటి కొనుగోలు విధానంలో మార్పునకు ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో వీటి కొనుగోలులో లోపాలు, వాటి దుష్పరిణామాలపై కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) సమగ్ర నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను లోతుగా పరిశీలించిన తరువాత మంత్రి సత్యకుమార్ కొనుగోలు విధానంలో మార్పునకు ఆదేశించారు. ప్రస్తుతం మూడు నెలల అవసరాలకు సరిపడా మందులు, తదితరాలను కొనుగోలు చేస్తున్నారు. అందుకు భిన్నంగా ఆరు నెలల డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు చేయాలని తాజాగా జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ఆదేశించారు.
ఇందుకు అనుగుణంగా వచ్చే ఏడాది జనవరి-జూన్ కాలానికి అవసరమైన మందులు, సర్జికల్స్ కొనుగోలు ప్రక్రియను ఈ నెల 10న ఏపీఎంఎస్ఐడీసీ ప్రారంభించింది. గతానికి భిన్నంగా అవసరాల మేరకు ముందస్తుగానే జరిగే ఈ కొనుగోలు ప్రక్రియను మొదటిసారిగా చేపట్టారు. ఈ కొనుగోలు ప్రక్రియను సుమారు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో డిసెంబరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మందులు, సర్జికల్స్ సరఫరా విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తిన మంత్రి... గురివింద గింజ సామెతన మాజీ సీఎం ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రులకు అవసరమైన 600కిపైగా మందుల్లో కేవలం 1.50ు మందులనే మాత్రమే సరఫరా చేసినట్లు కాగ్ వెల్లడించిందని మంత్రి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి: