పక్షవాత బాధితులకు ఉచిత వైద్యం
ABN , Publish Date - Oct 30 , 2026 | 04:55 AM
పక్షవాత బాధితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు కొనసాగిస్తూనే, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పక్షవాతం బాధితులకు చికిత్సను క్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 22.86 కోట్లు ఖర్చు: మంత్రి సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పక్షవాత బాధితులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు కొనసాగిస్తూనే, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పక్షవాతం బాధితులకు చికిత్సను క్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత నెలలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద తెనాలి జిల్లా ఆస్పత్రిలో పక్షవాతం బాధితులకు హబ్ అండ్ స్పోక్ విధానంలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. రక్తపు గడ్డలు కరిగించే చికిత్సలో భాగంగా 9 మందికి ఖరీదైన టెనెక్ట్ప్లేజ్ ఇంజెక్షన్లు ఇచ్చామని, వారు కోలుకున్నారని చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు పక్షవాత రోగుల చికిత్స కోసం రూ.22.86 కోట్లు వ్యయం చేసినట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ తెలిపిందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు