Share News

ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ల సస్పెన్షన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:21 AM

విధులకు గైర్హాజరవుతున్న ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారి సస్పెన్షన్‌ను తక్షణమే అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ల సస్పెన్షన్‌

విధులకు గైర్హాజరవుతున్న ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారి సస్పెన్షన్‌ను తక్షణమే అమల్లోకి తీసుకొస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురయిన ఇద్దరూ మార్కాపురం కేంద్రంగా పనిచేసే ఎస్‌డీసీలే ఉన్నారు. వీరిలో ఒకరు ఎంవీ సత్యనారాయణ, మరొకరు కుంభం ఎస్‌డీసీ ఎం.వెంకటేశ్వరరావు. ఎంవీ సత్యనారాయణ జూలై 22 నుంచి, ఎం.వెంకటేశ్వరరావు సెప్టెంబరు 2 నుంచి విధులకు హాజరుకావడం లేదు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 06:23 AM