ఇక సెర్ప్ ద్వారా ఎన్‌ఎఫ్‌బీఎస్ అమలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:57 AM
కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు అమలుచేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అమల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది.
ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అండగా పథకం
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు అమలుచేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్) అమల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈ పథకాన్ని ఇకపై సెర్ప్ ద్వారా ఎస్‌ఎన్‌ఏ-స్పార్ష్ వేదికపై నేరుగా అమలు చేసేందుకు అనుమతించింది. ఆ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆదేశాలిచ్చింది.
ఈ పథకం కింద 18 ఏళ్లు పైబడిన 60 ఏళ్ల లోపు ఉండి కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి మరణిస్తే అర్హులైన కుటుంబానికి ఒకేసారి రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తారు. మరణానికి కారణంతో సంబంధం లేకుండా ఈ సాయం వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేల లోపు ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను సంబంధిత ఆర్డీఓ స్వీకరిస్తారు.
ఈ వార్తలనూ చదవండి: