Share News

171 అంబేడ్కర్‌ గురుకులాల్లో తాగునీటికి చర్యలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:50 AM

రాష్ట్రవ్యాప్తంగా 171 అంబేడ్కర్‌ గురుకులాల్లో తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం రూ.8.43 కోట్ల నిధులు మంజూరుచేసింది.

171 అంబేడ్కర్‌ గురుకులాల్లో తాగునీటికి చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా 171 అంబేడ్కర్‌ గురుకులాల్లో తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం రూ.8.43 కోట్ల నిధులు మంజూరుచేసింది. ఏపీఈడబ్ల్యూఐడీసీ సమర్పించిన సమగ్ర అంచనాల మేరకు 185 బోరుబావుల తవ్వకం, 205 సబ్‌మెర్సిబుల్‌ మోటార్ల ఏర్పాటు కోసం ఈ నిధులు కేటాయిస్తూ సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఈడబ్ల్యూఐడీసీని పనుల అమలు సంస్థగా నియమించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద వివిధ శాఖలకు కేటాయించిన అందుబాటులో ఉన్న నిధులతో ఈ పనులు చేపట్టనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 05:51 AM