‘మున్సిపల్’ సర్వీసు రూల్స్‌లో మార్పులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:28 AM
రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు నియామక నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులకు అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్ఠంగా 34 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష నియామకానికి గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు
కమిషనర్ అభ్యర్థుల వయోపరిమితి నిబంధనకూ సవరణ
అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు నియామక నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులకు అభ్యర్థుల వయసు కనీసం 21 ఏళ్లు, గరిష్ఠంగా 34 ఏళ్లు ఉండాలని స్పష్టం చేసింది. 1990 నాటి ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు రూల్స్‌కు ఈ మేరకు సవరణలు చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం ఈ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మున్సిపల్ కమిషనర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపికయ్యే అభ్యర్థుల వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈ మేరకు 1959 నాటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్ల సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు సవరణలు చేసింది. ఎంపిక నోటిఫికేషన్ జారీచేసే సంవత్సరంలో జూలై 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి: