Share News

వృద్ధుల ఆరోగ్యంపై అవగాహన: ఆరోగ్యశాఖ

ABN , Publish Date - Oct 01 , 2026 | 04:09 AM

వృద్ధులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

వృద్ధుల ఆరోగ్యంపై అవగాహన: ఆరోగ్యశాఖ

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వృద్ధులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. గురువారం (అక్టోబరు 1న) అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ నెలంతా వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వృద్ధులకు ఇంటివద్దే ఆరోగ్య పరీక్షలు, వైద్యసేవలు, ఫిజియోథెరఫీ వంటి సేవలు అందిస్తున్నామని చెప్పారు. గురువారం అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించి, వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి...

ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’

రైతులకు తీపి కబురు

Updated Date - Oct 01 , 2026 | 04:09 AM