Share News

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:37 PM

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సిట్ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం..
Sai Krishna Custodial

అమరావతి, జులై 11: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సిట్ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన కఠిన నిబంధనలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలన్న షరతును సిట్ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నిరంతర వీడియో నిఘా వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.


సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సీన్ రికన్‌స్ట్రక్షన్‌కు హైకోర్టు కండీషన్లు అడ్డంకిగా మారాయని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని ఎటువంటి కఠిన షరతులు లేకుండా విచారించేందుకు అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. కాగా, విజయవాడలో సంచలనం సృష్టించిన కస్టోడియల్ డెత్ కేసులో నిజాలు రాబట్టేందుకు సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారింది. సిట్ వేసిన ఈ పిటిషన్‌ వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం: రాజ్‌నాథ్ సింగ్

ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్: విక్రయానికి పిచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated Date - Jul 11 , 2026 | 12:41 PM