Share News

21 పట్టణ సంస్థల్లో 112 గ్రామాల విలీనం

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:24 AM

రాష్ట్రంలో 112 గ్రామ పంచాయతీలను 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, రెండు కార్పొరేషన్లలో విలీనం చేసిన నేపథ్యంలో ప్రభావిత మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు ...

21 పట్టణ సంస్థల్లో 112 గ్రామాల విలీనం

  • మిగిలిన పంచాయతీలతో ప్రభావిత మండలాలపునర్వ్యవస్థీకరణ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 112 గ్రామ పంచాయతీలను 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, రెండు కార్పొరేషన్లలో విలీనం చేసిన నేపథ్యంలో ప్రభావిత మండల పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విలీనం తర్వాత ఆయా మండల పరిషత్‌ల పరిధిలో మిగిలిన గ్రామ పంచాయతీలతోనే వాటిని పునర్వ్యవస్థీకరించినట్లుగా పరిగణించాలని స్పష్టం చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 148(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్‌ శాఖ 2021లో చేసిన చట్టం కింద 112 గ్రామ పంచాయతీలను.. 14 మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీల్లో 95 గ్రామాలు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో 17 గ్రామాలను విలీనం చేశారు.

దీనిపై దాఖలైన అప్పీళ్లపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర హైకోర్టు ఈ నెల 1న ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి కూడా పంపించింది. ఈ నిర్ణయంతో ప్రభావిత మండల పరిషత్‌ల పరిపాలనా పరిధిలో మిగిలిన గ్రామ పంచాయతీలు కొనసాగుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:24 AM