Share News

తాగునీటి వనరుల పరిరక్షణకు కమిటీలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:47 AM

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల సుస్థిరత, సంరక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో సోర్స్‌ సస్టెనెన్స్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

తాగునీటి వనరుల పరిరక్షణకు కమిటీలు

  • జల్‌జీవన్‌ మిషన్‌ 2.0లో భాగంగా ఉత్తర్వులు

అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వనరుల సుస్థిరత, సంరక్షణ కోసం రాష్ట్ర, జిల్లా, గ్రామ పంచాయతీ స్థాయిలో సోర్స్‌ సస్టెనెన్స్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర స్థాయిలో ఎస్‌డబ్ల్యూఎస్ఎం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, జిల్లా స్థాయిలో డీడబ్ల్యూఎస్ఎం, గ్రామ స్థాయిలో గ్రామ నీటి, పారిశుధ్య కమిటీ సోర్స్‌ సస్టెనెన్స్‌ కమిటీలుగా వ్యవహరిస్తాయి.

ఈ కమిటీలు తాగునీటి వనరుల లభ్యతను పరిరక్షించడం, నీటి నాణ్యతలు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, నీటి ఎద్దడి గ్రామాల వర్తింపు వంటి కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో నీటి బడ్జెట్‌ తయారీ, నీటి వనరుల రక్షణ, ఇతర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం ద్వారా రీచార్జ్‌ పనులు చేపట్టాలి. ఈ ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ను ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 05:49 AM