ఇది కదా దాతృత్వం!
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:51 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఉద్యోగులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్న సంకల్పం...
ఉద్యోగుల ఉదారత..
వైద్య విద్యార్థి చదువుకు సాయం
రిసెప్షనిస్టు కుమారుడికి రూ.5.73 లక్షల విరాళం
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉద్యోగుల చేయూత
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఉద్యోగులు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎంబీబీఎస్ సీటు సాధించిన ఓ విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో అందరూ కలసి రూ.5,73,400 విరాళంగా అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో కె.చంద్రమతి రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు కె.రాజీవ్‌కు 2026లో విజయనగరంలోని మహారాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌సలో ఎంబీబీఎస్ ‘ఏ’ కేటగిరీ సీటు లభించింది.
అయితే వైద్యవిద్యకు అవసరమైన ఫీజులు, ఇతర ఖర్చులు ఆ కుటుంబానికి భారంగా మారాయి. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ స్పందించారు. రాజీవ్ చదువు కోసం సాయం చేయాలని అధికారులకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణతేజ తన వంతు సాయంగా రూ.1.70 లక్షలు అందజేశారు. ఆయన పిలుపు మేరకు పంచాయతీరాజ్ విభాగం అధికారులు, సిబ్బంది రూ.1,53,900, గ్రామీణాభివృద్ధిశాఖ విభాగం అధికారులు, సిబ్బంది రూ.1,29,500 అందించారు. అటవీశాఖకు చెందిన డి.జోసెఫ్, ఏపీ సచివాలయంలోని ఇతరులు కలిపి రూ.1 లక్ష ఇచ్చారు. ఇలా మొత్తం రూ.5,73,400 విరాళంగా అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి