ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 05:32 AM
రాష్ట్రంలోని ఆహార శుద్ధి పరిశ్రమలకు చెల్లించాల్సిన పెండింగ్ ప్రోత్సాహకాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రూ. 22.25 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతి
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆహార శుద్ధి పరిశ్రమలకు చెల్లించాల్సిన పెండింగ్ ప్రోత్సాహకాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ పరిధిలోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ఇన్సెంటివ్స్‌గా రూ. 22.25 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చిరంజీవ్ చౌధురి సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి: