Share News

భూరికార్డుల ఆధునికీకరణకు కేంద్రం నిధులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:49 AM

ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక, సాంకేతికత ఆధారిత, పౌర స్నేహపూర్వక భూ పరిపాలన సాకారమవుతోందని...

భూరికార్డుల ఆధునికీకరణకు కేంద్రం నిధులు

  • కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక, సాంకేతికత ఆధారిత, పౌర స్నేహపూర్వక భూ పరిపాలన సాకారమవుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఏపీలో భూ రికార్డులను ఆధునికీకరించేందుకు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రామ్‌-3.0 కింద మొదటి విడతగా రూ.6.96 కోట్లు విడుదలయ్యాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో విశాఖపట్నం(గాజువాక), కాకినాడ, విజయవాడ, గుంటూరులలో 4 పాస్‌పోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే)-మోడల్‌ సబ్‌-రిజిస్ర్టార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 122 రెవెన్యూ కోర్టుల కంప్యూటరీకరణ, 3 కోట్ల పేజీల పాత భూ రికార్డుల డిజిటలైజేషన్‌, 1977 కాడాస్ట్రల్‌ మ్యాప్‌ల డిజిటైజేషన్‌ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 01:52 AM