తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:51 AM
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37 పోలింగ్ నమోదు కాగా...
చిత్తూరు జిల్లాలో అత్యధికం...
శ్రీకాకుళంలో అత్యల్పం..
23 యూఎల్‌బీల్లో 63.44 శాతం నమోదు
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37 పోలింగ్ నమోదుకాగా, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో 83.33 శాతం నమోదైంది. కాగా శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 66.93 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను వెల్లడించింది.
తొలి విడతలో మొత్తం 3,949 సర్పంచ్, 39,832 వార్డు సభ్యుల స్థానాలను గుర్తించారు. వాటిలో 760 సర్పంచ్‌లు, 14,731 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 709 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, మొత్తం వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కాగా 3,189 సర్పంచ్, 25,057 వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సగటున 63.44 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..