Share News

టమాటా, మామిడి పంటలకు బీమా

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:44 AM

ప్రస్తుత రబీ సీజన్‌ 2026-27లో రుణం పొందిన, పొందని టమాటా, మామిడి రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది.

టమాటా, మామిడి పంటలకు బీమా

  • గడువులోగా ప్రీమియం చెల్లించాలన్న వ్యవసాయ శాఖ

అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత రబీ సీజన్‌ 2026-27లో రుణం పొందిన, పొందని టమాటా, మామిడి రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. టమాటా రైతులు డిసెంబరు 15లోగా, మామిడి రైతులు డిసెంబరు 31లోగా ప్రీమియం చెల్లించాలని సూచించింది. టమాటా పంటకు అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలు, మామిడి పంటకు అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్‌, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప జిల్లాలు నోటిఫై చేసినట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం రైతుసేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని సూచించింది.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 02:47 AM