ఐపీఎస్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు
ABN , Publish Date - Nov 11 , 2026 | 04:35 AM
రాష్ట్ర సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. సీఐడీ ఏడీజీగా పనిచేసిన సమయంలో ఎస్‌సీ, ఎస్టీలకు సంబంధించిన నిధుల మళ్లింపు...
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్ సస్పెన్షన్‌ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. సీఐడీ ఏడీజీగా పనిచేసిన సమయంలో ఎస్‌సీ, ఎస్టీలకు సంబంధించిన నిధుల మళ్లింపు, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో గోల్‌మాల్‌కు సంబంధించి ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్నారు. తాజాగా మరో 6 నెలలు... పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!