వార్షిక ఆరోగ్య పరీక్షలు 5 నుంచి 9కి పెంపు
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:48 AM
రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించి, సకాలంలో వైద్యం అందించేందుకు 2026-27లో వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ విస్తరిస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఊబకాయం, ఫ్యాటీ లివర్, శ్వాసకోశ, మానసిక సమస్యలపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించి, సకాలంలో వైద్యం అందించేందుకు 2026-27లో వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ విస్తరిస్తోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రంలో త్వరంలో ప్రారంభం కానున్న పరీక్షలపై ఆయన అధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. ‘ఇప్పటి వరకూ అధిక రక్తపోటు, మధుమేహం, నోటి-రొమ్ము-గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబంధించి ఐదు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. కొత్తగా ఊబకాయం, ఫ్యాటీ లివర్, దీర్ఘకాలిక శ్వాసకోశ, మానసిక ఆరోగ్య సమస్యలనూ చేరుస్తున్నాం. మొత్తంగా తొమ్మిది రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. 18 ఏళ్లు పైబడిన వారికి ఈ పరీక్షలు జరుపుతారు’ అని మంత్రి తెలిపారు.
సమావేశంలో కమిషనర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ.. ‘‘కేంద్ర సర్వే ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళల శాతం 36.3 నుంచి 47.9 శాతానికి పెరిగింది. ఈ కార్యక్రమాన్ని ‘ఒకే లక్ష్యం-ఒకే బృందం-అసంక్రమిత వ్యాధులపై సమష్టి పోరాటం’ నినాదంతో నిర్వహిస్తున్నాం’’ అని వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి