ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు!
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:53 AM
దేవదాయ శాఖ పేరు చెప్పి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పష్టం చేశారు.
డబ్బు వసూలు చేసిన వారిపై చర్యలు: దేవదాయ కమిషనర్
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ పేరు చెప్పి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. నిరుద్యోగులు మోసపోవద్దని ఒక ప్రకటనలో హెచ్చరించారు. విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వెలుపల నిరుద్యోగులతో మాట్లాడిన మహిళ వీడియో వైరలైన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి