ఓడిపోయినా ఖర్చుల వివరాలు చెప్పాల్సిందే!
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:55 AM
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని, ఈ బాధ్యతను మున్సిపల్ కమిషనర్లు తీసుకోవాలని...
పోటీ చేసిన అభ్యర్థులకు ఎన్నికల కమిషనర్ పునేఠా ఆదేశం
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని, ఈ బాధ్యతను మున్సిపల్ కమిషనర్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఓడిపోయిన అభ్యర్థి సహా, పోటీచేసిన ప్రతి అభ్యర్థీ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి వ్యయ వివరాలను సమర్పించాలన్నారు.
ఎన్నికైన అభ్యర్థులు వివరాలు సమర్పించకపోతే పదవులను కోల్పోవడంతో పాటు, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషనర్ పునేఠా మంగళవారం సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి: