దివ్యాంగుల దినోత్సవం ఘనంగా జరపాలి
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:43 AM
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబరు 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నవ్యాంధ్ర దివ్యాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబరు 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నవ్యాంధ్ర దివ్యాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. సోమవారం ఈ మేరకు ఆయన రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల దినోత్సవానికి నిధులు మంజూరు చేసినా పలు జిల్లాల్లోని దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీలు సక్రమంగా వినియోగించకుండా దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆవిధంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి: