విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: డీజీపీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:24 AM
పంచాయతీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ...
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గురువారం తొలివిడత పంచాయతీ, మలి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి 18 జిల్లాల్లో 44 ఘటనలు నమోదైనట్లు చెప్పారు. వాటిపై కేసులు నమోదు చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా