ఆయుధం వీడితే పునరావాసం
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:40 AM
మావోయిస్టు కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ప్రశాంత జీవనం గడపాలనుకునే వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.
బయటకొచ్చిన 18 మంది మావోయిస్టులకు
75 లక్షల సాయం అందజేత: డీజీపీ
అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కార్యకలాపాలకు స్వస్తి చెప్పి ప్రశాంత జీవనం గడపాలనుకునే వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు. ఇటీవల లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షల పునరావాస సాయం ఇంటెలిజెన్స్ ఐజీ పీహెచ్‌డీ రామక్రిష్ణతో కలసి శనివారం అందజేశారు.
మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు బాస్ మాట్లాడారు. ‘గత రెండున్నరేళ్లలో ఏపీ పోలీసుల కృషితో 134 మంది మావోయిస్టులు లొంగి పోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.2.87 కోట్ల రివార్డులు ఉండగా ఇప్పటికే 84 మందికి రూ.91 లక్షలు పంపిణీ చేశాం. తాజాగా 18 మందికి సాయం అందజేస్తున్నాం.
మరో 32 మందికి త్వరలో రూ.1.21 కోట్లు అందజేయనున్నాం. లొంగిపోయిన వారికి ఉపాధి కల్పిస్తున్నాం. గిరిజన, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులతో జిల్లా అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి వారి సమస్యలు పరిష్కరించారు’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..