టెన్త్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థి.. ఏపీ డిప్యూటీ సీఎంఓ అభినందనలు..
ABN , Publish Date - May 05 , 2026 | 04:33 PM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందిస్తున్న ఓ బాలుడు పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. ఏకంగా 555 మార్కులు సాధించాడు.
అమరావతి, మే 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘భగవంతుని పిల్లలు (తల్లిదండ్రులు లేని పిల్లలు)’ పేరుతో కొంతమందిని ఎంపిక చేసి, వారికి తన జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ఆర్థిక సాయం అందిస్తున్న ఓ బాలుడు పదో తరగతి పరీక్షల్లో సత్తా చాటాడు. ఏకంగా 555 మార్కులు సాధించాడు. యు. కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ 555 మార్కులు సాధించాడు.
పవన్ కుమార్ పదో తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున ఏపీ డిప్యూటీ సీఎంఓ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘పిఠాపురం నియోజకవర్గం, యూ. కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన ఆకుల పవన్ కుమార్ మొన్న విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో 555 మార్కులు సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ నెల ఉప ముఖ్యమంత్రి జీతం నుంచి 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందుకుంటున్న భగవంతుని పిల్లల్లో ఒకరైన పవన్ కుమార్ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది: సీఎం చంద్రబాబు
త్రీమెన్ కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై ఫోకస్