Share News

వన్యప్రాణులకు ముప్పు కలిగించొద్దు

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:48 AM

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

వన్యప్రాణులకు ముప్పు కలిగించొద్దు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్‌ ఫారె్‌స్టలో సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి, తొలగించారు. వాహనాల బ్రేక్‌ వైర్లతో ఉచ్చులు ఏర్పాటు చేయడాన్ని గుర్తించారు.

దీంతో బ్రేక్‌ వైర్లు దుర్వినియోగం కాకుండా ఆటోమొబైల్‌ షాపుల యజమానులు, మోటార్‌ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని పవన్‌కల్యాణ్‌ బుధవారం అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దన్నారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములై ఇలాంటి చర్యలను నిరోధించాలని కోరారు. మారేడుమిల్లి ఫారెస్ట్ ఉచ్చులు తొలగించిన సిబ్బందిని అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:53 AM