మత్స్యకారులకు తీవ్ర నష్టం..!
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:18 AM
ఉప్పాడ తీరంపై అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు భారీ నష్టం వాటిల్లిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
విపత్తు వేళ సీఎం చంద్రబాబు పనితీరు భేష్ : పవన్ కల్యాణ్
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఉప్పాడ తీరంపై అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు భారీ నష్టం వాటిల్లిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం క్యాబినెట్ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, కోనసీమ జిల్లా పరిధిలో మరో 117 బోట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటికి వీలైనంత త్వరగా తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తుఫాన్ కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా పవన్ మంత్రివర్గం ముందుంచారు. విపత్తు సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సీఎం చంద్రబాబు చేసిన కృషి అభినందనీయమని పవన్ కొనియాడారు.
అన్నయ్య నాగబాబుకు జన్మదిన శుభాకాంక్షలు: తన చిన్న అన్నయ్య కె నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్యకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు