ఎన్నికల కమిటీలతో పవన్ భేటీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:23 AM
స్థానిక ఎన్నికల కమిటీలతో జనసేనపార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం జరిగింది.
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల కమిటీలతో జనసేనపార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై కమిటీ సభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి సలహాలు, సూచనలు అందించారు. కమిటీ సభ్యుల నుంచి జిల్లాల వారీగా ఉన్న వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్ లక్ష్యంగా నాయకులు, అభ్యర్థులు ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
17వ వార్షికోత్సవంలో ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి ఆదిత్య..
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు