Share News

పంచాయతీ పోలింగ్‌ రోజు సెలవు

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:07 AM

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు ప్రకటించారు.

పంచాయతీ పోలింగ్‌ రోజు సెలవు

అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల పోలింగ్‌ జరిగే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సెలవు ప్రకటించారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు ఈనెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆయా తేదీల్లో పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవు దినంగా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది.

అయితే స్థానిక సెలవు దినాల్లో కూడా రాష్ట్రంలోని ట్రెజరీలు, సబ్‌-ట్రెజరీలు యథావిధిగా పని చేస్తాయి. పోలింగ్‌కు ముందు 44 గంటలు, తర్వాత కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ మంగళవారం విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 444 కేసులు నమోదు చేశామని ఐజీ రాజకుమారి వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 722 బైండోవర్‌ కేసులు నమోదు చేసి 5,327 మందిని బైండోవర్‌ చేశామన్నారు. 200 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 02:10 AM