Share News

సీపీఎస్‌ ఉద్యోగులందరికీ ఓపీఎస్‌

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:39 AM

రాష్ట్రంలోని లక్షలాది మంది సీపీఎస్‌ ఉద్యోగులందికీ పలు రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగా ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సీపీఎస్‌ ఉద్యోగులందరికీ ఓపీఎస్‌

  • సిఫారసు చేయాలని ఏపీసీపీఎస్ఈఏ వినతి

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని లక్షలాది మంది సీపీఎస్‌ ఉద్యోగులందికీ పలు రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగా ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ కోరారు. ఈ మేరకు 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

అలాగే, 11 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఓపీఎస్‌కు మారడానికి ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులకు తగిన పరిష్కారాలు చూపాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌ కోరారు. మంగళవారం ఈ మేరకు అమరావతి సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శి గౌతమ్‌ అల్లాడను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 02:40 AM