విద్యుత్ సరఫరా పునరుద్ధరణ వేగవంతం
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:06 AM
అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు వెంటనే మరమ్మతులు చేసి, సరఫరాను పునరుద్ధరించేపనులు వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి ఆదేశించారు.
అధికారులకు సీపీడీసీఎల్ సీఎండీ ఆదేశం
విజయవాడ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లకు వెంటనే మరమ్మతులు చేసి, సరఫరాను పునరుద్ధరించేపనులు వేగవంతం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి ఆదేశించారు. కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో సెంట్రల్ డిస్కం పరిధిలోని బాపట్ల, గుంటూరు, సీఆర్డీఏ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. 1663 విద్యుత్ స్తంభాలు, 33కేవీ స్తంభాలు 125, 11కేవీ స్తంభాలు 749, ఎల్‌టీ స్తంభాలు 789, 33/11కేవీ సబ్‌స్టేషన్‌లు 168, 33కేవీ ఫీడర్‌లు 65, 33కేవీ విద్యుత్ లైన్‌లు 15.3 కిలోమీటర్లు, 11కేవీ లైన్‌లు 57.05 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్‌లు 85.07 కిలోమీటర్లు, 280 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. రూ.4.52 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడిన గ్రామాలు, వ్యవసాయేతర, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల వివరాల నష్టం అంచనా పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేసేందుకు కృష్ణా జిల్లాలో 600 మంది సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించినట్లు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?