87 పట్టణ సంస్థల్లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పూర్తి
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:02 AM
రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించగా, ఇప్పటి వరకు 87 పట్టణ స్థానిక సంస్థల్లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రకియ్ర పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
టీడీపీ 57, జనసేన 19, బీజేపీ 8, వైసీపీ 2, ఇండిపెండెంట్ 1
నేడు మిగిలిన 13 సంస్థల్లో నిర్వహణ
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించగా, ఇప్పటి వరకు 87 పట్టణ స్థానిక సంస్థల్లో వైస్ చైర్‌పర్సన్ ఎన్నికల ప్రకియ్ర పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. తెలుగుదేశం పార్టీ 57, జనసేన 19, బీజేపీ 8, వైసీపీ 2 గెలిచాయి. ఇండిపెండెంట్ ఒక చోట నెగ్గారు. వాయిదా పడిన మిగిలిన13 పట్టణ స్థానిక సంస్థలు పలాస-కాశీబుగ్గ, యలమంచిలి, నర్సీపట్నం, మాచర్ల, నాయుడుపేట, పుత్తూరు, ధర్మవరం, జమ్మలమడుగు, రాజంపేట, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు(నెల్లూరు)లో వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలను మంగళవారం నిర్వహిస్తారు.
ఈ వార్తలనూ చదవండి: