Share News

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపట్లేదు

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:21 AM

ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను సక్రమంగా విడుదల చేస్తోందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం వెల్లడించింది.

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఆపట్లేదు

  • ఈ ప్రభుత్వంలో సక్రమంగా నిధులు

  • ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల సంఘం

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను సక్రమంగా విడుదల చేస్తోందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం వెల్లడించింది. దీంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నామని పేర్కొంది. సంఘం అధ్యక్షుడు కోయ సుబ్బారావు, గ్రంథి సత్యనారాయణ, కోశాధికారి గద్దె రాజ్‌లింగ్‌, కార్యవర్గసభ్యుడు నారాయణరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుత ప్రభుత్వం కాలేజీల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందిస్తోందన్నారు. గత రెండున్నరేళ్లల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద సుమారు రూ.5వేల కోట్లు చెల్లిందని తెలిపారు. ప్రతినెలా సుమారు రూ.250 కోట్లు ఫీజులు విడుదల చేస్తోందని, అయితే దాన్ని రూ.400 కోట్లకు పెంచితే బకాయిలు త్వరగా తగ్గిపోతాయని సూచించారు.

ప్రభుత్వం ఫైనలియర్‌ విద్యార్థులకు మొత్తం ఫీజులు ఒకేసారి చెల్లిస్తున్నందున సర్టిఫికెట్లు నిలిపివేసే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో సుమారు రూ.800 కోట్ల మేర ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. చిత్తూరులో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఫీజులు ఒత్తిడి కారణం కాకపోవచ్చన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:22 AM