Share News

ఆ ఐఏఎస్‌ దెబ్బకు.. టోల్‌గేట్‌ చిరుద్యోగుల బలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:28 AM

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి ఐదుగురు చిరుద్యోగులు బలయ్యారు. సీనియర్‌ ఐఏఎస్‌ కారు ఆపి టోల్‌ ఫీజు అడగడమే నేరంగా ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.

ఆ ఐఏఎస్‌ దెబ్బకు.. టోల్‌గేట్‌ చిరుద్యోగుల బలి

  • టోల్‌ ఫీజు కట్టకుండా కార్తికేయ మిశ్రా ‘అతి’

  • యాజమాన్యంపై ఒత్తిడి.. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం

  • సూపర్‌వైజర్‌, ఇన్‌చార్జి సహా ఐదుగురి తొలగింపు

తుళ్లూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కార్తికేయ మిశ్రా ఆగ్రహానికి ఐదుగురు చిరుద్యోగులు బలయ్యారు. సీనియర్‌ ఐఏఎస్‌ కారు ఆపి టోల్‌ ఫీజు అడగడమే నేరంగా ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ‘నా కారునే ఆపుతారా’ అంటూ గురువారం విజయవాడ పశ్చిమ బైపా్‌సలోని వెంకటపాలెం టోల్‌గేట్‌ వద్ద కార్తికేయ మిశ్రా హూంకరిస్తూ, అక్కడి సిబ్బందిపై చిందులు తొక్కిన విషయం తెలిసిందే. సీఎంవో కార్యదర్శి స్థాయిలో ఉండి చిన్న ఉద్యోగులతో ఆయన గొడవ పెట్టుకోవడం అందరినీ విస్మయపరిచింది.

రూ.వంద ఫీజు కట్టడానికి ఇంత యాగీ చేయాలా.. అనే చర్చ జరిగింది. అయినా.. తనను ఆపిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ కార్తికేయ మిశ్రా హుకుం జారీచేశారు. కాంట్రాక్ట్‌ సంస్థ ‘స్కైలార్క్‌’ యాజమాన్యానికి ఫోన్‌ చేసి ఒత్తిడి తెచ్చారు. ఆ ఘటనలో నిజానికి, చిరుద్యోగుల తప్పు లేదని మేనేజ్‌మెంట్‌కు కూడా తెలుసు. అయినా, సీఎంవో కార్యదర్శి హుకుంను పాటించాల్సిన పరిస్థితి. దీంతో టోల్‌గేట్‌ సూపర్‌వైజర్‌, ఇన్‌చార్జితోపాటు ఐదుగురిని ఆ సంస్థ తీసివేసింది. వీరంతా రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఉంటున్నట్టు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:30 AM