మా అరకు కాఫీ తాగండి..
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:03 AM
ఒకరోజు ముందుగానే సదస్సు కోసం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. విదేశీ ప్రతినిధులు, అతిథులకు అరకు కాఫీ గిఫ్ట్ బాక్సును అందించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది.
మా చాక్లెట్ రుచి చూడండి
చంద్రబాబు-యూఏఈ మంత్రి మధ్య సరదా సన్నివేశం
ఒకరోజు ముందుగానే సదస్సు కోసం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. విదేశీ ప్రతినిధులు, అతిథులకు అరకు కాఫీ గిఫ్ట్ బాక్సును అందించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రికి అరకు కాఫీ రుచి గురించి చంద్రబాబు ప్రత్యేకంగా వివరిస్తూ.. అరకు కాఫీ తాగిన ప్రతి సారీ మీరు మా రాష్ట్రాన్ని, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్పారు. అల్ మర్రీ స్పందిస్తూ..
‘‘మీ రాష్ట్రానికి చెందిన అరకు బ్రాండ్ కాఫీని నాకు అందించారు. బదులుగా మా దేశం నుంచి తెచ్చిన చాక్లెట్లను ఇస్తున్నాం’’ అన్నారు. ఆ చాక్లెట్లను తీసుకున్న చంద్రబాబు..‘‘మీరు తెచ్చిన ఈ చాక్లెట్లకు అవసరమైన కోకో మా వద్ద పండుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మా దగ్గర లభించే కోకోతో చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు’’ అన్నారు. చాక్లెట్ బాక్స్ ఇస్తే దానిలోనూ పెట్టుబడుల కోణం చూస్తున్నారంటూ యూఏఈ మంత్రి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు