Share News

‘చాంటిక్లియర్‌’.. అన్నమయ్య కీర్తన అద్భుతం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:21 AM

పదిహేనో శతాబ్దపు వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ కీర్తనను స్విట్జర్లాండ్‌లోని సోల్స్‌ బర్గ్‌ ఫెస్టివల్‌ - 2026 వేదికపై ఆలపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

‘చాంటిక్లియర్‌’.. అన్నమయ్య కీర్తన అద్భుతం

  • సోషల్‌ మీడియాలో వైరలైన వీడియోపై సీఎం ప్రశంసలు

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పదిహేనో శతాబ్దపు వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’ కీర్తనను స్విట్జర్లాండ్‌లోని సోల్స్‌ బర్గ్‌ ఫెస్టివల్‌ - 2026 వేదికపై ఆలపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చాంటిక్లియర్‌ బృందం ఆలపించిన ఈ కీర్తనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఇది అద్భుతమైన ప్రదర్శన అంటూ గ్రామీ అవార్డు విజేత చాంటిక్లియర్‌ బృందానికి ప్రశంసలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘సకల జీవులంతా ఒక్కటేననే అన్నమాచార్య కీర్తనలోని సందేశం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. సరిహద్దులు, భాషలు, తరాలకు అతీతంగా నిలిచే మన తెలుగు సంస్కృతి, వారసత్వపు గొప్పతనాన్ని ఈ అజరామరమైన కీర్తన గుర్తు చేస్తోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 05:27 AM