Share News

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:18 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది.

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం ఆయన అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరుగనుంది. అది ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ బయల్దేరతారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తారు. జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సహా కొందరు కేంద్ర మంత్రులతోనూ సమావేశమవుతారు. అదేరోజు రాత్రి అమరావతి చేరుకుంటారు. పోలవరం-నల్లమలసాగర్‌ అనుసంధాన పథకానికి అనుమతి ఇవ్వాలని.. పోలవరం ప్రాజెక్టు రెండో దశకు రూ.42,000 కోట్లు మంజూరు చేయాలని.. పోలవరం స్పిల్‌వేపై ఐకానిక్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి రూ.2300 కోట్లు కావాలని జలశక్తి మంత్రిని ఆయన కోరనున్నట్లు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:18 AM