Share News

ప్రజలకు అందే సేవల్లో జాప్యం వద్దు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:43 AM

ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై సోమవారం ఆర్టీజీఎస్‌ ఆధ్వర్యంలో సీఎం సమీక్షించారు.

ప్రజలకు అందే సేవల్లో జాప్యం వద్దు!

ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై సోమవారం ఆర్టీజీఎస్‌ ఆధ్వర్యంలో సీఎం సమీక్షించారు. వైద్యారోగ్యం, పంచాయతీరాజ్‌, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, ఇరిగేషన్‌, మెప్మా, సెర్ప్‌ తదితర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా పనితీరుపై నివేదికను ఆర్టీజీఎస్‌ సమర్పించింది. దానిపై సీఎం సమీక్షించారు. ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవల్లో జాప్యానికి తావివ్వొద్దని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 05:45 AM