Share News

సైబర్‌ నేరాల కట్టడికి సీఐడీ కీలక చర్యలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:20 AM

పెరుగుతున్న సైబర్‌ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సీఐడీ కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ సంస్థలు, ...

సైబర్‌ నేరాల కట్టడికి సీఐడీ కీలక చర్యలు

  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఫిన్‌టెక్‌, ఏపీఎస్‌టీ, ఐ4సీ ప్రతినిధులతో సమావేశం

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న సైబర్‌ ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సీఐడీ కీలక చర్యలు చేపట్టింది. బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ సంస్థలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీఎస్‌టీ), కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) ప్రతినిధులతో సోమవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది. మంగళగిరిలోని సీఐడీ కేంద్ర కార్యాలయంలో డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. దీనిలో సైబర్‌ నేరాలను సమష్టిగా ఎదుర్కోవడం, ఆర్థిక లావాదేవీల వ్యవస్థల భద్రతను పటిష్ఠం చేయడంపై చర్చించారు. వివిధ సంస్థలకు చెందిన సుమారు 120 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హెచ్‌ఎస్‌బీసీ, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ సీఐఎస్‌వోలు, ఐటీ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌, ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఐఐఎఫ్ఎల్‌ సమస్త, ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులూ హాజరయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 04:23 AM