నేర నిర్ధారణలో వేలిముద్రలే కీలకం
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:59 AM
నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాధారం ఎంతో విలువైందని ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. పలు జిల్లాల న్యాయమూర్తులు, జూనియర్ సివిల్ జడ్డిలకు ...
న్యాయాధికారులకు ఏపీ సీఐడీ అవగాహన కార్యక్రమం
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నేర నిర్ధారణలో వేలిముద్రల సాక్ష్యాధారం ఎంతో విలువైందని ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు. పలు జిల్లాల న్యాయమూర్తులు, జూనియర్ సివిల్ జడ్డిలకు వేలిముద్రల సాక్ష్యాలపై అవగాహన సదస్సు జరిగింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏపీసీఐడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ డైరెక్టర్ కేవీ శ్రీనివాసరావు నేతృత్వంలో నిపుణుల బృందం.. నేర స్థలం నుంచి సేకరించిన ఆధారాల పరిరక్షణ, విచారణలో వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ, వాటి సాక్ష్యాధార విలువ తదిర అంశాలపై జడ్జీలకు అవగాహన కల్పించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు